కరోనా వ్యాక్సినేషన్ ఎఫెక్ట్.. పోలియో టీకా పంపిణీ వాయిదా
- 17న ‘పోలియో ఆదివారం’
- వరుస కార్యక్రమాలతో వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై ప్రభావం
- పోలియో ఆదివారాన్ని తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ వెల్లడించని కేంద్రం
16న వ్యాక్సినేషన్ ప్రారంభం కానుండగా, 17న టీకాల పంపిణీకి సెలవు ప్రకటించారు. 18 నుంచి యథావిధిగా వ్యాక్సినేషన్ పంపిణీ ప్రారంభం కానుంది. కరోనా వ్యాక్సినేషన్ కోసం అన్ని రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాయి. ఇప్పటికే ఆసుపత్రులను కూడా ఎంపిక చేశాయి. టీకా నిల్వల కోసం పటిష్ఠ చర్యలు తీసుకున్నాయి. నేడు ఆయా రాష్ట్రాలకు కరోనా టీకా సరఫరా కానుంది.