Pakistan: ఉగ్రవాది మసూద్ అజర్‌ను అరెస్ట్ చేసి తీసుకురండి: పోలీసులకు పాక్ కోర్టు ఆదేశం

Masood Azhar By January 18 Pakistan Court Tells Police
  • లష్కరే కమాండర్ జకీవుర్ రెహ్మాన్‌కు జైలు శిక్ష విధించిన మరునాడే ఆదేశాలు
  • ఉగ్రవాదులకు నిధులు సమకూర్చినట్టు అభియోగాలు
  • గడువులోపు అరెస్ట్ చేయకుంటే అపరాధిగా ప్రకటిస్తామని హెచ్చరిక
ముంబై పేలుళ్ల సూత్రధారి, లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీకి 15 ఏళ్ల జైలు శిక్ష విధించిన మరునాడే పాకిస్థాన్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు (ఏటీసీ) మరో సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18లోపు అంతర్జాతీయ ఉగ్రవాది, నిషేధిత జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అరెస్ట్ చేసి తమ ఎదుట హాజరు పరచాలని నిన్న పంజాబ్ పోలీసులను ఆదేశించింది. మసూద్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

 మసూద్ అజర్‌పై ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, జిహాదీ సాహిత్యాన్ని విక్రయించడం వంటి అభియోగాలు నమోదయ్యాయి. తామిచ్చిన గడువులోపు అజర్‌‌ను అరెస్ట్ చేయడంలో విఫలమైతే, అతడిని నేరస్తుడిగా ప్రకటించేందుకు అవసరమైన చర్యలను ప్రారంభిస్తామని న్యాయస్థానం హెచ్చరించింది.
Pakistan
Masood Azhar
ATC
Terrorist

More Telugu News