భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తీసుకుని వాలంటీర్ మృతి... వివరణ ఇచ్చిన సంస్థ!
- అతనిపై విషప్రయోగం జరిగి వుండవచ్చు
- మరణానికి కారణం విచారణ తరువాత తెలుస్తుంది
- వారం రోజులు ఆరోగ్యం బాగానే ఉందన్న భారత్ బయోటెక్
అతను ఓ ప్రభుత్వ ఉద్యోగని, ఓ ప్రైవేటు హాస్పిటల్ లో వ్యాక్సిన్ ను వేశామని తెలిపిన భారత్ బయోటెక్, ఫాలో అప్ కాల్స్ లో అతను ఆరోగ్యంగానే ఉన్నాడని పేర్కొంది. మూడవ దశ ట్రయల్స్ లో పాల్గొనేందుకు తనకేమీ అభ్యంతరం లేదని చెబుతూ, అన్ని నియమ నిబంధనలనూ అతను అంగీకరిస్తూ సంతకాలు చేశారని తెలిపింది. అతనిపై విషప్రయోగం జరిగి వుండవచ్చని, మరణానికి అసలైన కారణం విచారణ తరువాత తెలుస్తుందని వెల్లడించింది.