డబుల్ బెడ్రూం ఇంటిని తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేసిన మహిళ... కారణం ఇదే!
- సిద్ధిపేట జిల్లాకు చెందిన లక్ష్మికి డబుల్ బెడ్రూం ఇల్లు
- తాను, తన కుమార్తె మాత్రమే ఉంటామని లక్ష్మి వెల్లడి
- కుమార్తెకు పెళ్లయిపోతే తానొక్కదాన్నే ఉంటానని వివరణ
- ఒక్కదానికి డబుల్ బెడ్రూం ఇల్లెందుకన్న లక్ష్మి
- అభినందించిన మంత్రి హరీశ్ రావు
ప్రస్తుతం తాను, తన కుమార్తె మాత్రమే ఉంటున్నామని, కుమార్తెకు పెళ్లయి అత్తారింటికి వెళ్లిపోతే, తన ఒక్కదానికి డబుల్ బెడ్రూం ఇల్లు ఎందుకని పేర్కొంది. అందుకే తిరిగి ఇచ్చేస్తున్నామని, ఎవరైనా పేద కుటుంబానికి ఈ ఇల్లు ఇస్తే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని లక్ష్మి అభిప్రాయపడింది. తమకు ఇల్లు కేటాయించినందుకు ఆమె మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఎంతో పెద్దమనసుతో ఆలోచించిన లక్ష్మిని మంత్రి హరీశ్ రావు మనస్ఫూర్తిగా అభినందించారు. లక్ష్మి చర్య అందరికీ ఆదర్శనీయం అని కొనియాడారు.