మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు వలంటీర్ల నమోదు పూర్తి: భారత్ బయోటెక్ ప్రకటన
- అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన కొవాగ్జిన్
- మూడో దశ క్లినికల్ ప్రయోగాల దశలో వ్యాక్సిన్
- తొలి రెండు దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి
- మూడో దశలో 26 వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యం
- 28,500 మంది పేర్ల నమోదు
మూడో దశ క్లినికల్ ప్రయోగాల కోసం తాము 26 వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని భావించామని, 25,800 మంది వలంటీర్లు ముందుకొచ్చారని భారత్ బయోటెక్ వెల్లడించింది. ఈ మేరకు భారత్ బయోటెక్ సంస్థ జేఎండీ సుచిత్రా ఎల్ల తెలిపారు. వ్యాక్సిన్ అభివృద్ధి చేసే క్రమంలో తమకు సహకరిస్తున్న అందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.