వ్యవసాయ చట్టాల ముఖ్య ఉద్దేశాన్ని రైతులు అర్థంచేసుకోవాలి: తోమర్
- నూతన వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చిన కేంద్రం
- తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు
- చట్టాలను రద్దు చేయాలంటూ డిమాండ్
- చర్చలు విఫలం
"భారత కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఈ వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇస్తున్నవారినీ కలిశాం, వ్యతిరేకిస్తున్న వారినీ కలిశాం. ఇప్పుడీ చట్టాలను నిరసిస్తున్న వారు చట్టాలు చేయడానికి గల కారణాలను అవగాహన చేసుకుని వెంటనే చర్చలకు వచ్చి ఓ పరిష్కారం పొందుతారని భావిస్తున్నాం" అని తోమర్ తెలిపారు. మరోవైపు రైతులు, తమ ఆందోళన కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నెల 7న ఢిల్లీ సరిహద్దుల్లో ట్రాక్టర్లతో ప్రదర్శన నిర్వహించనున్నారు.