Attack: ఏపీలో మరో దాడి... విశాఖలో వినాయక విగ్రహం చేయి ధ్వంసం చేశారు: విష్ణువర్ధన్ రెడ్డి

Vishnuvardhan Reddy says another attack on Hindu Temples in AP
  • రాష్ట్రంలో కొనసాగుతున్న విగ్రహాల ధ్వంసం
  • మరో దాడి జరిగిందని వెల్లడించిన విష్ణువర్ధన్ రెడ్డి
  • చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని వెల్లడి
  • తామే బాధితులం అంటూ సీఎం ప్రచారం చేసుకుంటున్నారని విమర్శలు
ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలకు అడ్డుకట్ట పడడంలేదు. తాజాగా, విశాఖలో ఓ హిందూ దేవాలయంపై దాడి జరిగిందని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. విశాఖలో వినాయక ఆలయంలో విగ్రహం చేయి ధ్వంసం చేశారని వివరించారు. ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్న దుండగులపై చర్యలు తీసుకోవడంలేదంటూ వైసీపీ సర్కారును విమర్శించారు.

పైగా, ఈ ఘటనలతో తమను ఇబ్బంది పాల్జేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సీఎం జగన్ చెప్పుకుంటున్నారని ఆరోపించారు. చర్యలు తీసుకునే బదులు, తామే బాధితులం అవుతున్నామని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. గత కొన్నిరోజుల వ్యవధిలోనే రామతీర్థం, రాజమండ్రిలో విగ్రహాల ధ్వంసం ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి.
Attack
Ganesh Temple
Visakhapatnam
Vishnu Vardhan Reddy
Andhra Pradesh

More Telugu News