arup goswami: ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా అరూప్‌ గోస్వామి ప్రమాణ స్వీకారం

arup goswamy takes oath as a highcourt cj
  • విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్య‌క్ర‌మం
  • ప్ర‌మాణం చేయించిన  బిశ్వభూషణ్‌ హరిచందన్
  • హాజ‌రైన ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్  
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామితో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ తో పాటు  రాష్ట్ర ప్ర‌భుత్వ‌ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ప‌లువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు.
     
అనంతరం తేనీటి విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ త‌ర్వాత అరూప్‌కుమార్‌ గోస్వామి హైకోర్టుకు, సీఎం తాడేపల్లిలోని త‌న‌ నివాసానికి వెళ్లారు. కాగా, 2019, అక్టోబరు 15 నుంచి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించిన అరూప్ కుమార్ ఏపీకి బదిలీపై వచ్చిన విష‌యం తెలిసిందే.
arup goswami
Jagan
Andhra Pradesh
AP High Court

More Telugu News