నిన్న రాత్రి నుంచే పోలీసులు బెదిరించడం ప్రారంభించారు: జనసేన నేత నాదెండ్ల
- కోదండరామ స్వామి విగ్రహ శిరచ్ఛేదన దుస్సంఘటనను ఖండిస్తున్నాం
- రామతీర్థ యాత్రను ప్రభుత్వం అడ్డుకుంటోన్న తీరు సరికాదు
- తెల్లవారు జాము నుంచే గృహ నిర్బంధాలు
నిన్న రాత్రి నుంచే ఉత్తరాంధ్ర జిల్లాల్లోని జనసేన వ్యవహారాల కమిటీ సభ్యులను, నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తామని బెదిరించడం ప్రారంభించారని చెప్పారు. ఈ రోజు తెల్లవారు జాము నుంచే నేతలను, శ్రేణులను గృహ నిర్బంధంలో ఉంచడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పోలీసు స్టేషన్లకు తీసుకెళ్లారని తెలిపారు. కాగా, పోలీసుల తీరుపై బీజేపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.