కన్నుమూసిన హాలీవుడ్ జేమ్స్ బాండ్ హీరోయిన్
- తాన్యా రాబర్ట్స్ మృతి
- ఇటీవల కుప్పకూలిన తాన్యా
- లాస్ ఏంజెలిస్ ఆసుపత్రిలో చికిత్స
- పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచిన నటి
అందానికి పర్యాయపదంలా నిలిచిన తాన్యా రాబర్ట్స్ 1985లో వచ్చిన 'ఏ వ్యూ టు ఏ కిల్' బాండ్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించారు. ఆ సినిమాలో తాన్యా స్టేసీ సట్టన్ అనే జియాలజిస్టు పాత్ర పోషించారు.
ఇదే కాకుండా అనేక ఇతర హాలీవుడ్ చిత్రాల్లోనూ ఆమె నటించారు. ద బీస్ట్ మాస్టర్, షీనా: క్వీన్ ఆఫ్ ద జంగిల్, బాడీ స్లామ్, నైట్ ఐస్ వంటి చిత్రాలతో అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.