కార్పొరేట్ వ్యవసాయంలోకి ప్రవేశించం.. రైతుల భూములు కూడా కొనుగోలు చేయం: రిలయన్స్ కీలక ప్రకటన
- రైతుల నుంచి నేరుగా పంటను కొనుగోలు చేయం
- మా సరఫరాదారులు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తారు
- మా సెల్ టవర్ల విధ్వంసం వెనుక విదేశీ శక్తులు ఉన్నాయి
రైతుల నుంచి తాము నేరుగా పంటను కొనుగోలు చేయబోమని... తమ సరఫరాదారులు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ప్రకారం కొనుగోలు చేస్తారని రిలయన్స్ తెలిపింది. రైతులకు వారి పంటకు లాభదాయకమైన ధర లభించాలనేదే రిలయన్స్, దాని సంబంధిత సంస్థల అభిమతమని చెప్పింది. కనీస మద్దతు ధరకు కట్టుబడి ఉండాలని తమ సరఫరాదారులను కూడా కోరుతున్నామని తెలిపింది. పంజాబ్, హర్యానాల్లో రిలయన్స్ సెల్ టవర్ల విధ్వంసం వెనుక విదేశీ శక్తులతో పాటు, తమ వ్యాపార శత్రువులు కూడా ఉన్నట్టు భావిస్తున్నామని చెప్పింది.