భర్తను చంపిన ఇల్లాలు... ఫేస్ బుక్ లో పోస్టు చూసి ఫిర్యాదు చేసిన పొరుగువారు
- ఢిల్లీలో దారుణం
- భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య
- భర్తను చంపిన విషయం ఫేస్ బుక్ లో వెల్లడి
- ఆపై ఆత్మహత్యకు యత్నించిన వైనం
ఈ నేపథ్యంలో, వారి పొరుగింటి వాళ్లు ఫేస్ బుక్ లో ఓ పోస్టు చూసి హడలిపోయారు. తాను భర్తను హత్య చేసినట్టు ఆ మహిళ ఫేస్ బుక్ ద్వారా వెల్లడించింది. ఈ విషయాన్ని పొరుగింటి వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు వచ్చి అపార్ట్ మెంట్ తలుపులు బలవంతంగా తెరిచి చూడగా భయానక దృశ్యాలు కనిపించాయి.
భర్త రక్తపు మడుగులో పడి ఉండగా, భార్య స్పృహకోల్పోయిన స్థితిలో దర్శనమిచ్చింది. ఆ గదిలో నేలపై రక్తం మడుగు కట్టి ఉంది. అంతేకాదు, గోడలపై రక్తం చల్లి ఉండడాన్ని గమనించారు. భర్తను కత్తితో పొడిచి చంపిన తర్వాత భార్య ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు పోలీసులు తెలుసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఆ మహిళను చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.