దొంగలను పట్టుకోవడంలో పోలీసులు ఉపయోగించే టెక్నిక్ లలో ఇదొకటి... విజయసాయి ఈ విధంగానే దొరికిపోయాడు: అయ్యన్న
- రామతీర్థంలో వాడీవేడి వాతావరణం
- పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న వైసీపీ, టీడీపీ నేతలు
- విగ్రహం తల లేపింది విజయసాయిరెడ్డేనన్న అయ్యన్న
- నిన్నటినుంచి భుజాలు తడుముకుంటున్నారని వ్యంగ్యం
నువ్వు దొంగవి... నీ సంగతి చూస్తా అంటే ఒక దొంగ ఉలిక్కిపడడం సహజమేనని అన్నారు. కాబట్టే, రామతీర్థంలో చంద్రబాబు పర్యటిస్తున్నారని తెలియగానే విజయసాయిరెడ్డి భుజాలు తడుముకుంటూ దొరికిపోయారని అయ్యన్న తెలిపారు. ఇప్పటివరకు 140 దేవాలయాలపై దాడులు జరిగితే ఒక్క చోటుకు అయినా వెళ్లాడా? అని వ్యాఖ్యలు చేశారు. "దొంగలను పట్టుకోవడంలో పోలీసులు ఉపయోగించే టెక్నిక్ లలో ఇదొకటి. నిన్నటి నుంచి భుజాలు తడుముకుంటూ వీసారెడ్డి ఇలా దొరికిపోయాడు" అని అయ్యన్న వెల్లడించారు.