Ayyanna Patrudu: దొంగలను పట్టుకోవడంలో పోలీసులు ఉపయోగించే టెక్నిక్ లలో ఇదొకటి... విజయసాయి ఈ విధంగానే దొరికిపోయాడు: అయ్యన్న

Ayyanna Patrudu satires on Vijayasai Reddy
  • రామతీర్థంలో వాడీవేడి వాతావరణం
  • పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న వైసీపీ, టీడీపీ నేతలు
  • విగ్రహం తల లేపింది విజయసాయిరెడ్డేనన్న అయ్యన్న
  • నిన్నటినుంచి భుజాలు తడుముకుంటున్నారని వ్యంగ్యం
ఏపీ రాజకీయాలు ఇప్పుడు రామతీర్థం చుట్టూ తిరుగుతున్నాయి. ఇక్కడి క్షేత్రంలో రాముడి విగ్రహం తల నరికి కోనేరులో పడేయడం రాజకీయంగా తీవ్ర ఆగ్రహావేశాలు కలిగిస్తోంది. అంతేకాదు, ఈ ఘటన మీ కుట్రేనంటూ టీడీపీ, వైసీపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. దీనిపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు స్పందించారు. రామతీర్థంలో రాముల వారి విగ్రహం తల తొలగించింది విజయసాయిరెడ్డేనని ఆరోపించారు.

నువ్వు దొంగవి... నీ సంగతి చూస్తా అంటే ఒక దొంగ ఉలిక్కిపడడం సహజమేనని అన్నారు. కాబట్టే, రామతీర్థంలో చంద్రబాబు పర్యటిస్తున్నారని తెలియగానే విజయసాయిరెడ్డి భుజాలు తడుముకుంటూ దొరికిపోయారని అయ్యన్న తెలిపారు. ఇప్పటివరకు 140 దేవాలయాలపై దాడులు జరిగితే ఒక్క చోటుకు అయినా వెళ్లాడా? అని వ్యాఖ్యలు చేశారు. "దొంగలను పట్టుకోవడంలో పోలీసులు ఉపయోగించే టెక్నిక్ లలో ఇదొకటి. నిన్నటి నుంచి భుజాలు తడుముకుంటూ వీసారెడ్డి ఇలా దొరికిపోయాడు" అని అయ్యన్న వెల్లడించారు.
Ayyanna Patrudu
Vijay Sai Reddy
Ramatheertham
YSRCP
Telugudesam

More Telugu News