Vellampalli Srinivasa Rao: తన హయాంలో జరిగిన తప్పును ఒప్పుకున్న తర్వాతే చంద్రబాబు రామతీర్థం రావాలి: మంత్రి వెల్లంపల్లి

Minister Vellampalli Srinivas fires on Chandrababu Ramatheertham visit
  • రామతీర్థం క్షేత్రంలో విగ్రహ ధ్వంసం
  • రాజకీయ రంగు పులుముకున్న వ్యవహారం
  • రామతీర్థం బయలుదేరిన చంద్రబాబు
  • చంద్రబాబు ముందు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్న మంత్రి అవంతి
  • చంద్రబాబు రాకపై అనుమానాలు వ్యక్తం చేసిన వైనం
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విజయనగరం జిల్లా రామతీర్థం క్షేత్రానికి వస్తున్న నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనిపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి ఘాటుగా స్పందించారు. టీడీపీ హయాంలో దేవాలయాలను దగ్గరుండి కూల్చిన దుర్మార్గుడు చంద్రబాబు అని విమర్శించారు.  తన హయాంలో జరిగిన తప్పును ఒప్పుకుని, క్షమించమని ప్రజలందరినీ వేడుకోవాలని, ఆ తర్వాతే చంద్రబాబు రామతీర్థం రావాలని మరో మంత్రి అవంతి స్పష్టం చేశారు.

రాజకీయంగా బురద చల్లేందుకే చంద్రబాబు రామతీర్థం వస్తున్నారని ఆరోపించారు. ఇళ్ల పట్టాల పంపిణీ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే విగ్రహాల ధ్వంసానికి పాల్పడినట్టు భావిస్తున్నామని చెప్పారు. రామతీర్థం ఘటనపై కొన్ని ఆధారాలు లభించిన సమయంలో చంద్రబాబు ఎంతో హడావిడిగా వస్తున్నారంటే తమకు అనుమానంగా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు.
Vellampalli Srinivasa Rao
Chandrababu
Ramatheertham
Idol Vandalizing
YSRCP
Telugudesam
Andhra Pradesh

More Telugu News