దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు!
- ఈరోజు మరో నాలుగు కేసుల నమోదు
- మొత్తం 29కి పెరిగిన కేసుల సంఖ్య
- హైదరాబాద్ ల్యాబ్ లో ఒక కేసు గుర్తింపు
ఇప్పటి వరకు 10 కేసులు ఢిల్లీలోని ల్యాబుల్లో, 10 కేసులు బెంగళూరు ల్యాబ్ లో, 5 కేసులు పూణెలోని ల్యాబ్ లో, మూడు కేసులు హైదరాబాద్ ల్యాబులో, ఒక కేసు పశ్చిమబెంగాల్ లోని ల్యాబులో గుర్తించారు. కొత్త స్ట్రైయిన్ కు గురైన వారందరినీ తగిన వైద్య సదుపాయాలు ఉన్న ఐసొలేషన్లలో ఉంచారు.
ఈ కొత్త స్ట్రెయిన్ ఇతర కరోనా స్ట్రెయిన్ల కంటే వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు ఈ స్ట్రెయిన్ ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, డెన్మార్క్, స్వీడన్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీ, కెనడా, జపాన్, లెబనాన్, సింగపూర్, ఇండియా దేశాలకు విస్తరించింది.