ఇక 'ఇరవై ఇరవై' అంటే గత సంవత్సరం... అది తల్చుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది: మోహన్ బాబు

  • శుభాకాంక్షలు తెలిపిన మోహన్ బాబు
  • గత సంవత్సరంపై దిగ్భ్రాంతి
  • ఇలాంటి సంవత్సరం మరెప్పుడూ రాకూడదని కోరిక
  • అందరూ సన్మార్గంలో నడవాలని ఆకాంక్ష
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు అభిమానులకు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ లో స్పందించారు. ఇరవై ఇరవై అంటే గత సంవత్సరం... అది తల్చుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది అని వ్యాఖ్యానించారు. ఇలా కూడా జరుగుతుందా అని ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయభ్రాంతుల్ని చేసిందని తెలిపారు.

ఇలాంటి సంవత్సరం ఈ కలియుగం ఉన్నంతవరకు ఇక ఎప్పటికీ రాకూడదని, అందరూ గతాన్ని మర్చిపోయి మంచిగా ముందుకు ప్రయాణించాలని కోరుకుంటున్నానని మోహన్ బాబు అన్నారు. మంచిగా బ్రతకాలని, మంచి చేయాలని, సన్మార్గంలో నడవాలని, అందరూ క్షేమంగా ఉండాలని మనసా, వాచా ఆకాంక్షిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

Mohan Babu
New Year
2021
Wishes
Tollywood

More Telugu News