Nara Lokesh: ఒక మహిళను మోసం చేసిన కామాంధుడికి టీటీడీ పదవి కట్టబెట్టారా?: సీఎం జగన్ పై లోకేశ్ ఆగ్రహం

Lokesh fires on CM Jagan over Karan Reddy appointment as TTD Hyderabad advisory committee vice president
  • తిరుమలను ఏం చెయ్యాలనుకుంటున్నారన్న లోకేశ్
  • అన్నీ భక్తుల మనోభావాలు దెబ్బతీసే నిర్ణయాలేనని విసుర్లు
  • కరణ్ రెడ్డికి టీటీడీ పదవి ఇవ్వడం దారుణమని వ్యాఖ్యలు
  • ఇంతకుమించి మంచి వ్యక్తి దొరకలేదా అంటూ విమర్శలు
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమలను ఏం చెయ్యాలనుకుంటున్నారు? అంటూ ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మండిపడ్డారు. డిక్లరేషన్ దగ్గర్నుంచి భక్తులపై లాఠీచార్జి వరకు అన్నీ భక్తుల మనోభావాలు దెబ్బతీసే నిర్ణయాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళను మోసం చేసిన కామాంధుడికి టీటీడీ పదవి కట్టబెట్టారా? ప్రశ్నించారు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక మహిళ జీవితంతో ఆటలాడుకున్న కరణ్ రెడ్డికి టీటీడీ హైదరాబాద్ సలహా మండలి వైస్ ప్రెసిడెంట్ పదవి అప్పగించడం దారుణమని లోకేశ్ ఆరోపించారు. హిందూ ధార్మిక పరిరక్షణకు ఇంతకుమించి మంచి వ్యక్తి మీకు దొరకలేదా? అని నిలదీశారు. 'తిరుమల పవిత్రతను దెబ్బతీసే నిర్ణయాలు ఇకనైనా ఆపండి జగన్ రెడ్డి గారూ' అంటూ హితవు పలికారు. టీటీడీపై మీ 'దరువు' ఇకనైనా ఆపకపోతే ఆ తిరుమలేశుని ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
Nara Lokesh
Jagan
TTD
Karan Reddy
Vice President
Advisory Committee

More Telugu News