COVID19: జనవరి 2 నుంచి అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా వ్యాక్సిన్​ డ్రై రన్

All states to begin dry run for Covid19 vaccination from January 2
  • ఉన్నత స్థాయి సమీక్షలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం
  • ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో విజయవంతం
  • కొవిన్ ప్లాట్ ఫాంను సమర్థంగా మార్చేందుకు రాష్ట్రాల సలహాలు

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జనవరి 2 నుంచి కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, అస్సాంలలో నిర్వహించిన డ్రై రన్ విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వ్యాక్సిన్ కు త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని రాష్ట్రాల్లోనూ డ్రై రన్ నిర్వహించాలన్న నిర్ణయం తీసుకుంది.

‘‘వ్యాక్సిన్ వినియోగ కార్యకలాపాలు, పారదర్శకంగా వ్యాక్సిన్ పంపిణీ జరిగేందుకు టెక్నాలజీని వాడడం వంటి విషయాలపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. వ్యాక్సిన్ పంపిణీకి తయారు చేసిన కొవిన్ ప్లాట్ ఫాంను మరింత సమర్థంగా మార్చేందుకు రాష్ట్రాల సలహాలు తీసుకుంటున్నాం. వాటి ఆధారంగా వ్యాక్సిన్ పంపిణీకి సమగ్రమైన మార్గదర్శకాలు ఇవ్వడానికి, పంపిణీ చర్యలను కట్టుదిట్టం చేయడానికి వీలుంటుంది’’ అని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

  • Loading...

More Telugu News