Mohammed Azharuddin: రాజస్థాన్లో పెను ప్రమాదం నుంచి బయటపడ్డ అజారుద్దీన్

Azharuddin escapes from accidents with small injuries
  • న్యూఇయర్ వేడుకల కోసం రాజస్థాన్ వెళ్లిన అజార్ కుటుంబం
  • అదుపు తప్పి ధాబాలోకి దూసుకెళ్లిన కారు
  • అజార్ కు స్వల్ప గాయాలు
టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వివరాల్లోకి వెళ్తే, కొత్త సంవత్సర వేడుకల కోసం కుటుంబంతో కలిసి రాజస్థాన్ కు ఆయన బయల్దేరారు. రాజస్థాన్ లోని సుర్వార్ కు చేరుకున్న తర్వాత వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పింది.

రణథంబోర్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు పక్కనున్న ధాబాలోకి దూసుకెళ్లి, పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో అజార్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఆయన కుటుంబసభ్యులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ఆ తర్వాత వేరే వాహనంలో వారు హోటల్ కు వెళ్లిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు, ధాబాలో పని చేస్తున్న ఇషాన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
Mohammed Azharuddin
Accident
Rajasthan

More Telugu News