Kodali Nani: దమ్ముంటే వచ్చి నా చొక్కా పట్టుకో: పవన్ కల్యాణ్ కు కొడాలి నాని సవాల్

Kodali Nani challenges Pawan Kalyan
  • జగన్ మీద ఈగ వాలినా ఊరుకోబోము
  • నాకు వార్నింగ్ ఇచ్చే స్థాయి పవన్ కు లేదు
  • తంతే పక్క దేశంలో పడతాడు
జనసేనాని పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ను పవన్ ఒక్క మాట అంటే... మేము పది మాటలు అంటామని వ్యాఖ్యానించారు. జగన్ మీద ఈగ వాలినా ఊరుకోబోమని అన్నారు. చంద్రబాబుకు చిన్న ఆపద వచ్చినా పవన్ వచ్చేస్తారని... చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లిపోతారని విమర్శించారు. తనకు వార్నింగ్ ఇచ్చే స్థాయి వపన్ కు లేదని అన్నారు.

నువ్వు కొట్టగానే పది మంది ఎగిరి పడటానికి ఇది సినిమా కాదని కొడాలి నాని ఎద్దేవా చేశారు. దమ్ముంటే వచ్చి తన చొక్కా పట్టుకోవాలని... తంతే పక్క దేశంలో పడతావని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన కోసమే తప్ప... రైతుల కోసం పవన్ ఒక్క మాట కూడా మాట్లాడరని విమర్శించారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసినా ఏమీ చేయలేరని అన్నారు. పవన్ తనకు వార్నింగ్ ఇవ్వడమేమిటని అన్నారు.
Kodali Nani
Jagan
YSRCP
Pawan Kalyan
Janasena
Chandrababu
Telugudesam

More Telugu News