Vijayasai Reddy: పోలవరం కోసం చంద్రబాబు చేయలేనిదాన్ని ముఖ్యమంత్రి జగన్ చేస్తున్నారు: విజయసాయిరెడ్డి

Jagan wrote a letter to Modi on Polavaram Project tweets Vijayasai Reddy
  • పోలవరం కోసం చంద్రబాబు చేసిందేమీ లేదు
  • కమీషన్ల కోసం ఢిల్లీ యాత్రలు చేశారు
  • రాయపాటి కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు
పోలవరం ప్రాజెక్టు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చేసిందేమీ లేదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. పోలవరం కోసం చంద్రబాబు చేయలేనిదాన్ని ముఖ్యమంత్రి జగన్ చేస్తున్నారని చెప్పారు. సవరించిన తాజా అంచనాలకు కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వబోతోందని ఆయన తెలిపారు.

ప్రాజెక్ట్ కోసం కాకుండా కమీషన్ల కోసం గతంలో చంద్రబాబు ఢిల్లీ యాత్రలు చేశారని... తన పార్ట్ నర్ రాయపాటి సాంబశివరావు కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని విమర్శించారు. 2021లోగా పోలవరం పూర్తి చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి జగన్ లేఖ రాశారని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Vijayasai Reddy
Jagan
YSRCP
Chandrababu
Rayapati Sambasiva Rao
Telugudesam
Narendra Modi
BJP
Polavaram Project

More Telugu News