Mission Build AP: 'మిషన్ బిల్డ్ ఏపీ' కేసు.. అధికారి ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశం

AP High Court orders to file a case on Mission Build AP officer Pravin Kumar
  • తప్పుడు అఫిడవిట్ సమర్పించారని హైకోర్టు ఆగ్రహం
  • కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేయాలని ఆదేశం
  • తదుపరి విచారణ ఫిబ్రవరి రెండో వారానికి వాయిదా
మిషన్ బిల్డ్ ఏపీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. కేసుకు సంబంధించి తప్పుడు అఫిడవిట్ సమర్పించారంటూ బిల్డ్ ఏపీ అధికారి ప్రవీణ్ కుమార్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అంతేకాదు, ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కోర్టు ధిక్కారం కింద, క్రిమినల్ ప్రాసిక్యూషన్ కింద కేసులు నమోదు చేయాలని జ్యుడీషియల్ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.

తదుపరి విచారణను ఫిబ్రవరి 2వ వారానికి వాయిదా వేసింది. మిషన్ బిల్డ్ ఏపీ పథకం కింద ప్రభుత్వ భూములను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రక్రియను సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
Mission Build AP
AP High Court
Officer
Pravin Kumar
Case

More Telugu News