పండుగల కన్నా ప్రాణాలే ముఖ్యమని ప్రజలు గ్రహించాలి: మంత్రి ఈటల
- న్యూ ఇయర్ వేడుకలు ఇళ్లలోనే జరుపుకోవాలని హితవు
- శీతాకాలంలో కరోనా వేగంగా వ్యాపిస్తుందన్న ఈటల
- కొత్త స్ట్రెయిన్ ఏమంత ప్రమాదకారి కాదని వెల్లడి
- దీన్ని కూడా కట్టడి చేస్తామని ధీమా
అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో, పండుగల కన్నా ప్రాణాలే ముఖ్యమని ప్రజలు గ్రహించాలని హితవు పలికారు. ఇళ్లలోనే ఉండి న్యూఇయర్ వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ప్రజలు భయాందోళనలకు గురయ్యే విధంగా మీడియా కథనాలు ప్రసారం చేయరాదని ఈటల పేర్కొన్నారు. శీతాకాలంలో కరోనా వేగంగా వ్యాపించే అవకాశం ఉందని భావిస్తున్నామని తెలిపారు.