మోదీ నాయకత్వాన్ని మమత తప్ప ప్రపంచం మొత్తం అంగీకరిస్తోంది: టీఎంసీ మాజీ నేత సువేందు
- పాకిస్థాన్, బలూచిస్థాన్ ప్రజలు కూడా మోదీని ప్రశంసిస్తున్నారు
- బీజేపీ నాయకులను ఔట్‌సైడర్స్ అనడం తగదు
- మమత అల్లుడు రూ. 25 లక్షల విలువైన కళ్లద్దాలు ధరిస్తారు
- టీఎంసీ నాయకుల్లో క్రమశిక్షణ లేదు: సువేందు
టీఎంసీ నుంచి బయటకు వచ్చిన తాము క్రమశిక్షణ గల సైనికులమని, కానీ టీఎంసీ నాయకుల్లో క్రమశిక్షణ లేదని ఇటీవలే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)ని వీడి బీజేపీలో చేరిన సువేందు అధికారి అన్నారు. వచ్చే ఎన్నికల్లో బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు రాష్ట్రం సోనార్ బెంగాల్ (బంగారు బెంగాల్) అవుతుందని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ దేశ సేవకు అంకితమై పనిచేస్తోందన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల రైతులు పీఎం కిసాన్ నగదు ప్రయోజనాన్ని పొందుతుండగా, ఇక్కడి రైతులకు మాత్రం మమత దానిని దూరం చేశారని సువేందు అధికారి దుయ్యబట్టారు.