Manda Krishna: సీఐ ప్రతాప్ రెడ్డిపై చర్యలు తీసుకోండి: మంద కృష్ణ

Manda Krishna demands legal action on CI Pratap Reddy
  • ఏపీలో కలకలం రేపిన స్నేహలత హత్య
  • పోలీసులు సరైన సమయంలో స్పందించలేదన్న మంద కృష్ణ
  • ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని వ్యాఖ్య

అనంతపురం జిల్లాలో స్నేహలత హత్య కేసు సంచలనం రేపింది. ఈ ఘటనపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాట్లాడుతూ... స్నేహలతకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోలేదని చెప్పారు. పోలీసులు సరైన సమయంలో స్పందించి ఉంటే ఈ హత్య జరిగేది కాదని అన్నారు. ఇంత దారుణమైన ఘటన జరిగితే ముఖ్యమంత్రి జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

మహిళలపై దాడులు జరుగుతుంటే... ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఒక ప్రేమోన్మాదానికి స్నేహలత బలి అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దళిత సంఘాలు ఆందోళన కార్యక్రమాలను చేపట్టాయి.

  • Loading...

More Telugu News