Anil P Nedumangad: సుడిగుండంలో చిక్కుకుని చనిపోయిన మలయాళ నటుడు

Actor Anil P Nedumangad accidentally dies at a dam in Kerala
  • కేరళ వినోద రంగంలో విషాదం
  • నటుడు అనిల్ పి నెడుమాంగద్ ప్రమాదవశాత్తు మృతి
  • తొడుప్పుళ ప్రాంతంలో షూటింగ్
  • విరామంలో స్నేహితులతో కలిసి డ్యామ్ నీటిలో దిగిన వైనం
  • కబళించిన సుడిగుండం
మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. నటుడు అనిల్ పి నెడుమాంగద్ ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయారు. నిన్న సాయంత్రం కేరళలోని మలంకార డ్యామ్ వద్ద నీటిలో స్నానం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. నెడుమాంగద్ ఓ సినిమా షూటింగ్ కోసం తొడుప్పుళ ప్రాంతంలోని మలంకార డ్యామ్ వద్దకు వచ్చారు. షూటింగ్ విరామ సమయంలో స్నేహితులతో కలిసి నెడుమాంగద్ ప్రాజెక్టు నీటిలో దిగారు.

అంతా ఉల్లాసంగా జలకాలాడుతూ ఉన్న వేళ నెడుమాంగద్ సుడి గుండంలో చిక్కుకుని నీటిలో మునిగిపోయారు. కొందరు ఆయనను ఒడ్డుకు తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు తెలిసింది. నెడుమాంగద్ మృతి పట్ల మలయాళ సినీ, టీవీ రంగాలు తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. కేరళ టెలివిజన్ రంగంలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నెడుమాంగద్ ఆరేళ్ల కిందట సినీ రంగప్రవేశం చేశారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రలు పోషిస్తున్న తాజా చిత్రం మలయాళ మాతృక 'అయ్యప్పనుమ్ కోషియమ్'లో అనిల్ ముఖ్య పాత్ర పోషించాడు. 
Anil P Nedumangad
Demise
Malankara Dam
Kerala

More Telugu News