Rajinikanth: రజనీకాంత్‌ ఆరోగ్యం నిన్నటి కంటే మెరుగుపడింది: హైదరాబాద్ అపోలో వైద్యులు

rajani health is better than yesterday
  • తాజా బులెటిన్ విడుదల 
  • రక్తపోటు హెచ్చుతగ్గులకు సంబంధించి చికిత్స
  • పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని రజనీకాంత్‌కు సూచన
  • పరామర్శించేందుకు ఎవ్వరూ రావద్దని మరోసారి విజ్ఙప్తి
సినీనటుడు రజనీ కాంత్ అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. ఆయనకు మరిన్ని వైద్య పరీక్షలు చేశామని తెలిపారు. ఈ రోజు సాయంత్రంలోపు వైద్య పరీక్షల నివేదికలు వస్తాయని వైద్యులు చెప్పారు.

ప్రస్తుతం ఆసుపత్రిలో రజనీకాంత్‌కు రక్తపోటు హెచ్చుతగ్గులకు సంబంధించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని రజనీకాంత్‌కు తాము సూచించామని చెప్పారు. ఆయనను పరామర్శించేందుకు ఎవ్వరూ ఆసుపత్రికి రావద్దని వైద్యులు మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆయన ఆరోగ్యం నిన్నటి కంటే మరింత మెరుగుపడిందని తెలిపారు.
Rajinikanth
Tollywood
Tamilnadu
Hyderabad

More Telugu News