Road Accident: వికారాబాద్‌లో ఆటోను ఢీ కొన్న బస్సు, లారీ.. ఐదుగురి మృతి.. మరో ముగ్గురి పరిస్థితి విషమం

accident in vikarabad
  • ప్రాణాలు కోల్పోయిన కూలీలు
  • మరికొంత మందికి తీవ్రగాయాలు
  • మోమిన్‌పేట మండలంలోని ఇజ్రాచిట్టంపల్లి వద్ద ఘటన
  • రోడ్డుపై ఉన్న పొగమంచే కారణం
వికారాబాద్‌ జిల్లాలో  లారీ, ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొని ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారంతా కూలీలని తెలుస్తోంది. పనులకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరికొంత మందికి తీవ్రగాయాలయ్యాయి.

వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మోమిన్‌పేట మండలంలోని ఇజ్రాచిట్టంపల్లి గేటు వద్ద నిలిపి ఉన్న ఆటోను   ఆర్టీసీ బస్సు, లారీ ఒకేసారి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు కలిసి క్షతగాత్రులను సంగారెడ్డి ఆస్పత్రికి తీసుకెళ్లారు.
 
మృతులను శేణీ బాయి (55),  సంధ్య (18), సోనా బాయి (15), నితిన్ (15), రేణుక (15)గా పోలీసులు గుర్తించారు. వారంతా శంకర్‌పల్లి వద్ద పత్తి గోదాంలో కూలి పనులకు చిట్టంపల్లి నుంచి ఆటోలో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో రోడ్డుపై ఉన్న పొగమంచు వల్ల ఆటో కనపడకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.


Road Accident
Vikarabad District

More Telugu News