ఏపీలో కొత్తగా 355 కరోనా కేసులు

  • రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు మృతి
  • రాష్ట్రంలో 3,861 యాక్టివ్ కేసులు
  • 8,80,430కి చేరిన మొత్తం కేసుల సంఖ్య
ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 355 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో గుంటూరు జిల్లాలో ఒకరు, కృష్ణా జిల్లాలో మరొకరు మృతి చెందారు. మరోవైపు గత 24 గంటల్లో 354 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,80,430కి చేరుకున్నాయి.

మొత్తం 7,091 మంది ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయారు. 8,69,478 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,861 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,15,31,206 శాంపిల్స్ ని పరీక్షించారు.


More Telugu News

Andhra Pradesh Corona Virus Cases