Nara Lokesh: జేసీ ఇంట్లో  లేని సమయంలో ఆయన ఇంటిపై తాడిపత్రి ఎమ్మెల్యే దాడి చేయడాన్ని ఖండిస్తున్నా: నారా లోకేశ్

Nara Lokesh fires on YCP MLA Kethireddy Peddareddy
  • వైసీపీ ఎమ్మెల్యేలు వీధి రౌడీలకన్నా ఘోరమని వ్యాఖ్యలు
  • చట్టాన్ని ఉల్లంఘించి రెచ్చిపోతున్నారని విమర్శలు
  • రౌడీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • లేకపోతే తామే చర్యలు తీసుకుంటామని వార్నింగ్
  • అధికారంలోకి వచ్చి వడ్డీతో కలిపి చెల్లిస్తామని ఉద్ఘాటన
వైసీపీ ఎమ్మెల్యేలు వీధి రౌడీలకంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేని సమయంలో ఆయన ఇంటిపైనా, కార్యకర్తలపైనా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించి రెచ్చిపోయిన రౌడీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే, వైసీపీ రౌడీలకు కచ్చితంగా తామే బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు.

నాయకుల ఇళ్లపై దాడి చేసి, కార్యకర్తలను కొట్టి హీరోలమంటూ విర్రవీగుతున్నారని, వారి తల పొగరు అణచివేస్తామని లోకేశ్ ఘాటు హెచ్చరికలు చేశారు. టీడీపీ అధికారంలోకి రావడం, అన్నీ వడ్డీతో సహా తిరిగి చెల్లించడం ఖాయమని లోకేశ్ స్పష్టం చేశారు.
Nara Lokesh
Kethireddy Peddareddy
JC Prabhakar Reddy
Tadipathri
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News