Venkaiah Naidu: మూడు రోజుల పర్యటనకు ఏపీకి రానున్న ఉప రాష్ట్రపతి

Venkaiah Naidu coming to AP for 3 days visit
  • 27న విజయవాడకు రానున్న వెంకయ్య
  • రాత్రికి స్వర్ణ భారతి ట్రస్ట్ లో బస
  • 29న ఢిల్లీకి తిరుగుపయనం కానున్న ఉపరాష్ట్రపతి

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీ పర్యటనకు రానున్నారు. మూడు రోజుల పాటు విజయవాడలో ఆయన పర్యటించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 27న ఆయన విజయవాడకు వస్తారు. మధ్యాహ్నం 4 గంటలకు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ఆ రాత్రికి స్వర్ణ భారత్ ట్రస్ట్ లో బస చేస్తారు. 28న సూరంపల్లిలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో జరిగే కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. 29వ తేదీన గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.

  • Loading...

More Telugu News