తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా నిర్ధారణ

తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా టీఆర్ఎస్ నేత, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌కు కరోనా సోకింది. గత రెండు రోజుల నుంచి ఆయనకు నీరసంగా ఉండడంతో ప్రకాశ్ గౌడ్ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో తన రిపోర్టులో పాజిటివ్‌గా తేలిందని చెప్పారు.

ఇటీవల తనను కలిసిన వారు వెంటనే కరోనా‌ పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. తాను ప్రస్తుతం కరోనాకు చికిత్స తీసుకుంటున్నానని, కొన్ని రోజుల వరకు తనను పరామర్శించడానికి ఎవరూ ఫోన్ చేయొద్దని ఆయన చెప్పారు. తనను కలవటానికి కూడా ప్రయత్నాలు చేయవద్దని ఆయన కోరారు. దేవుడి ఆశీస్సులతో తాను త్వరలోనే కోలుకుంటానని, మళ్లీ ప్రజల ముందుకు వస్తానని
చెప్పారు.


More Telugu News