Raja Singh: గోరక్షణ కోసం ఎంతవరకైనా వెళతా... సొంత పార్టీ అయినా లెక్కచేయను: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు

Raja Singh comments on his own party
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ గోషామహల్ శాసనసభ్యుడు, బీజేపీ నేత రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మం, గోరక్షణ తన కర్తవ్యం అని, అందుకోసం ఎంతవరకైనా వెళతానని, ఈ విషయంలో సొంత పార్టీ అడ్డొచ్చినా లెక్కచేయనని స్పష్టం చేశారు. గోవు తన తల్లి వంటిదని, గోహత్యలు లేని రాష్ట్రాన్ని ఆవిష్కరించాలన్నదే తన అభిమతమని వివరించారు. అందుకోసం పదవులు అడ్డంకిగా మారినా వదులుకునేందుకు తాను సిద్ధమని అన్నారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కోరారు.

గోమాతల సంరక్షణ కోసం తాను గతంలో శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానంటే పార్టీ నాయకులు అంగీకరించలేదని, ఉన్న ఒక్క శాసనసభ్యుడు రాజీనామా చేస్తే ఎలాగంటూ నచ్చచెప్పారని రాజాసింగ్ వివరించారు. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన గో మహా ధర్నాలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Raja Singh
BJP
Cow
Hyderabad
Telangana

More Telugu News