డ్రోన్ ను ప్రయోగించిన పాక్... గుళ్లవర్షం కురిపించిన భారత సరిహద్దు భద్రతా దళం
- సరిహద్దుల్లో పాక్ దుశ్చర్యలు
- ఆయుధాలతో కూడిన డ్రోన్ ను పంపిన వైనం
- కాల్పుల నుంచి తప్పించుకున్న డ్రోన్
- నేలపైకి జారవిడిచిన పెట్టెలో గ్రనేడ్లు
- స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు
అయితే, డ్రోన్ జారవిడిచిన ఓ పెట్టెను గుర్తించిన బీఎస్ఎఫ్ సిబ్బంది 11 హ్యాండ్ గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్రనేడ్లను పాకిస్థాన్ లోని రావల్పిండిలో ఉన్న ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారుచేసినట్టు భావిస్తున్నారు. భారత్ లోకి ఇలాంటి ఆయుధాలను అక్రమ రవాణా చేసే ప్రయత్నం జరగడం గడచిన 15 నెలల్లో ఇది ఎనిమిదోసారి అని అధికారులు తెలిపారు.