జగన్ గారూ.. మీ వాళ్ళు తేడాగా లేరూ?: వర్ల రామయ్య
- వైసీపీకి సవాల్ చేస్తూ తొడకొట్టిన యరపతినేని
- యరపతినేనికి తొడే లేదన్న సజ్జల
- అంత నిశితంగా పరిశీలించే అవకాశం ఎలా వచ్చిందన్న వర్ల
ఈ నేపథ్యంలో టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, 'ముఖ్యమంత్రి గారూ! నిన్న బహిరంగసభలో యరపతినేని ప్రత్యర్థులపై తొడ గొట్టాడు. వేదికపై నేను కూడా వున్నాను. మీ సజ్జలగారు యరపతినేనికి తొడే లేదంటారు. అంత నిశితంగా పరిశీలించే అవకాశం సజ్జలకు ఎలా వచ్చింది? ఇంకో మంత్రి 'వయాగ్రా' తీసుకుంటే ఇలా ఉంటారని భాష్యం చెపుతారు. మీ వాళ్ళు తేడాగా లేరూ?' అని వర్ల ట్వీట్ చేశారు.