బెంబేలెత్తిస్తున్న కరోనా కొత్త వైరస్.. యూకేపై ట్రావెల్ బ్యాన్ విధించిన దేశాలు ఇవే!
- యూకేలో శర వేగంగా విస్తరిస్తోన్న కరోనా కొత్త వైరస్
- నెదర్లాండ్స్, డెన్మార్క్, ఆస్ట్రేలియాల్లో కూడా వైరస్ గుర్తింపు
- యూకేపై ట్రావెల్ బ్యాన్ విధించిన 10 దేశాలు
మరోవైపు నెదర్లాండ్స్, డెన్మార్క్, ఆస్ట్రేలియాల్లో కూడా కొత్త వైరస్ ను గుర్తించారని బీబీసీ ప్రకటించింది. ఇటీవలే బ్రిటన్ నుంచి తిరిగొచ్చిన ఒక వ్యక్తిలో కొత్త వైరస్ ను గుర్తించామని ఫ్రాన్స్ ఆరోగ్య మంత్రి నిన్న రాత్రి ప్రకటించారు. సదరు వ్యక్తికి కాంటాక్ట్ లోకి వచ్చిన వారందరినీ ఐసొలేషన్ లో ఉంచామని చెప్పారు.
యూకే నుంచి ట్రావెల్ బ్యాన్ పై డిసెంబర్ 31న సమీక్ష నిర్వహించి, తదుపరి నిర్ణయాన్ని తీసుకుంటామని జర్మనీ నిన్న రాత్రి తెలిపింది. 48 గంటల పాటు యూకే నుంచి వచ్చే విమానాలు, ఫెర్రీలపై నిషేధం విధిస్తున్నామని... మంగళవారం నాడు దీనిపై సమీక్ష నిర్వహిస్తామని ఐర్లండ్ ప్రకటించింది.