Sonu Sood: తెలంగాణలో సోనూ సూద్ కు గుడి

Actor Sonu Sood temple constructed in Telangana
  • సిద్ధిపేట జిల్లా చెలిమితాండాలో గుడి కట్టించిన అభిమాని
  • సొంత ఖర్చుతో విగ్రహ ఏర్పాటు
  • నిన్న పూజలు నిర్వహించిన స్థానికులు
విలన్ క్యారక్టర్లతో ప్రేక్షకులను అలరిస్తున్న సోనూ సూద్... నిజ జీవితంలో మాత్రం రియల్ హీరోగా మారాడు. లాక్ డౌన్ సమయంలో ప్రజల కోసం సోనూ సూద్ చేసిన సేవ... అతన్ని గొప్ప వ్యక్తిగా నిలిపింది. దేశ వ్యాప్తంగా ఎంతో మంది సోనూను అభినందిస్తున్నారు. తాజాగా తెలంగాణలో సోనూకు ఏకంగా గుడిని నిర్మించారు.

సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలం దుబ్బ తాండా పరిధిలోని చెలిమితాండాలో రాజేశ్ అనే అభిమాని విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. రాజేశ్ కు సోనూ సూద్ అంటే ఎంతో అభిమానం. సోనూ చేసిన సేవా కార్యక్రమాలతో అభిమానం మరింతగా పెరిగింది. దీంతో సొంత ఖర్చుతో ఆయనకు గుడి నిర్మించాడు. నిన్న సోనూ విగ్రహానికి రాజేశ్ తో పాటు స్థానికులు కూడా పూజలు నిర్వహించి, హారతి ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Sonu Sood
Temple
Tollywood
Telangana

More Telugu News