మీ ఆధ్వర్యంలో ఏపీ మరింత ముందుకు సాగాలి: జగన్ కు విషెస్ తెలిపిన మహేశ్ బాబు!

  • నేడు ముఖ్యమంత్రి జగన్ జన్మదినం 
  • మీరు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ మహేశ్ ట్వీట్ 
  • జగన్ కు పలువురి విషెస్
నేడు బర్డ్ డే జరుపుకుంటున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ కు టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టగా, అది వైరల్ అవుతోంది. "గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ దూరదృష్టి, కృషి ఏపీని మరింత అభివృద్ధిలోకి నడిపించాలి. మీరు ఆయురారోగ్యాలతో, నిత్యమూ సంతోషంగా ఉండాలి" అని ఆకాంక్షించారు. బర్డ్ డే జరుపుకుంటున్న జగన్ కు ఇప్పటికే పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు సెలబ్రిటీలు విషెస్ చెబుతున్నారు.

Mahesh Babu
Jagan
Birthday
Wishes

More Telugu News