Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బిగ్ బాస్-4 విజేత అభిజిత్

Abhijeet wins Bigg Boss season four title
  • ముగిసిన బిగ్ బాస్ నాలుగో సీజన్
  • మూడ్నెల్లకు పైగా సాగిన కార్యక్రమం
  • గ్రాండ్ ఫినాలేలో అభిజిత్, అఖిల్ మధ్య పోరు
  • అభిజిత్ చేయి పైకిలేపిన నాగ్
  • రన్నరప్ గా మిగిలిన అఖిల్
తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ నాలుగో సీజన్ లో అభిజిత్ విజేతగా నిలిచాడు. గ్రాండ్ ఫినాలేలో ఐదుగురు కంటెస్టెంట్లలో చివరికి అభిజిత్, అఖిల్ మిగలగా, నాగార్జున అభిజిత్ చేయిని పైకి లేపడంతో బిగ్ బాస్-4 విజేత ఎవరో తేలిపోయింది. అభిజిత్ కు ట్రోఫీ, క్యాష్ చెక్ తో పాటు ఓ ఖరీదైన బైక్ ను కూడా కానుకగా ఇచ్చారు. అఖిల్ రన్నరప్ గా మిగిలాడు.

ఈ సందర్భంగా అభిజిత్ మాట్లాడుతూ, తనకు మద్దతు ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు అంటూ వ్యాఖ్యానించాడు. బిగ్ బాస్ కు ధన్యవాదాలు తెలిపాడు. ఈ ప్రస్థానంలో తనకో పాత్ర ఇచ్చారంటూ వ్యాఖ్యానించాడు. ఈ షోలో పాల్గొనడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని వెల్లడించాడు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, బిగ్ బాస్ ఇల్లు వ్యక్తిత్వ వికాసానికి సరైన వేదిక అని అభిప్రాయపడ్డారు. ఎదుటివాళ్లతో ఎలా వ్యవహరించాలి, నేర్చుకున్న పాఠాలతో మనల్ని మనం ఎలా మలుచుకోవాలన్నది బిగ్ బాస్ షో చెబుతుందని అన్నారు.
Abhijeet
Bigg Boss Telugu 4
Winner
Title
Akhil

More Telugu News