Bandi Sanjay: గోల్కొండ కోటపై బీజేపీ జెండాను ఎగురవేస్తాం: బండి సంజయ్

bandi sanjay slams trs
  • కొందరు మా పార్టీని మతతత్వ పార్టీ అంటున్నారు
  • హిందూ ధర్మ పరిరక్షణ కోసమే మా పార్టీ పనిచేస్తోంది
  • 2023 ఎన్నికల్లో తెలంగాణలో గెలుస్తాం
నారాయణ పేట జిల్లాలోని అప్పంపల్లిలో నిర్మించిన స్వామి వివేకానంద విగ్రహాన్ని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.  

వివేకానంద స్ఫూర్తితోనే కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన కొనసాగుతోందని ఆయన చెప్పారు. కొందరు తమ పార్టీని మతతత్వ పార్టీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అది సరికాదని చెప్పారు. తమ పార్టీ హిందూ ధర్మ పరిరక్షణ కోసమే పనిచేస్తోందని తెలిపారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో గెలిచి గోల్కొండ కోటపై బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 


Bandi Sanjay
BJP
Telangana

More Telugu News