shakeela: చదువుకుంటోన్న అమ్మాయిలకు నేను చెప్పేది ఒక్కటే: నటి షకీలా
- జీవితంలో అందరూ బాధలు ఎదుర్కొంటారు
- నేను చేసిన తప్పులు ఏ అమ్మాయీ చేయొద్దు
- నాలా మోసపోవద్దు
- ‘షకీలా’ సినిమా మహిళల కోసమే
ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'షకీలా' సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా నటి షకీలా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన బయోపిక్‌పై స్పందించింది. తాను బతికుండగానే తన బయోపిక్ రూపుదిద్దుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది.
ఈ సినిమాను రూపొందించిన దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపింది. జీవితంలో అందరూ బాధలు ఎదుర్కొంటారని తెలిపింది. వారి బాధలు ఎదుటివాళ్లకి తెలియకపోవచ్చు కాబట్టి వారు కొంచెం తప్పుగా వ్యాఖ్యలు చేయవచ్చని చెప్పింది. తాను అటువంటి వ్యాఖ్యలను పట్టించుకోనని తెలిపింది.
మన ముందు మాట్లాడే ధైర్యం లేకే కొంతమంది మనం లేనప్పుడు మన గురించి చెడుగా మాట్లాడుతుంటారని షకీలా తెలిపింది. సినీ పరిశ్రమలోకి వచ్చిన అమ్మాయిలకు, చదువుకుంటున్న అమ్మాయిలకు తాను ఒక్క విషయాన్ని చెబుతున్నానని, తాను చేసిన తప్పులు వారు చేయొద్దని తెలిపింది. తనలా మోసపోవద్దని తెలిపింది. తాను షకీలా సినిమాను చూశానని, అందులో మహిళల కోసమే ప్రత్యేకంగా ఓ సందేశం ఉందని తెలిపింది.