Corona Virus: బ్రిటన్‌లో చెలరేగిపోతున్న కొత్త రకం కరోనా వ్యాక్సిన్.. మళ్లీ లాక్‌డౌన్ ప్రకటించిన ప్రభుత్వం

UK government announce another lockdown amid new corona virus
  • లండన్ సహా దక్షిణ ఇంగ్లండ్‌లో లాక్‌డౌన్
  • 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్
  • కొత్త వైరస్‌పై తాజా టీకా ప్రభావాన్ని చెప్పలేమంటున్న అధికారులు
బ్రిటన్‌లో కొత్తరకం కరోనా వైరస్ చెలరేగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. లండన్‌తోపాటు దక్షిణ ఇంగ్లండ్‌లో లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. నిన్నటి నుంచే ఆంక్షలు అమల్లోకి వచ్చినట్టు ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. బయటపడిన కొత్తరకం కరోనా వైరస్ 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు యూకే ప్రధాన వైద్యాధికారి తెలిపారు. బుధవారం నుంచి నమోదైన కరోనా కేసుల్లో 60 శాతం కంటే ఎక్కువగానే కొత్తరకం వైరస్ కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్ ఈ కొత్తరకం వైరస్‌కు అడ్డుకట్ట వేస్తుందని చెప్పలేమన్నారు.

క్రిస్మస్ సమీపిస్తున్న నేపథ్యంలో బ్రిటన్‌లో తాజా ఆంక్షల ప్రభావం పండుగపై పడే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని బోరిస్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. కరోనా వైరస్ కారణంగా ఈసారి క్రిస్మస్‌ను ఓ ప్రణాళిక ప్రకారం నిర్వహించుకోలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, యూకేలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ జోరుగా సాగుతోంది. మొదటి వారంలోనే దాదాపు 1.37 లక్షల మందికి తొలి డోసు టీకాను పంపిణీ చేశారు.
Corona Virus
Britain
Lockdown
Boris Johnson

More Telugu News