Narendra Modi: సాధారణ భక్తుడిలా గురుద్వారా రికబ్ గంజ్ సాహిబ్‌కు వెళ్లిన ప్రధాని మోదీ

PM Narendra Modi offers prayers at Gurudwara Rakab Ganj Sahib in Delhi
  • సిక్కుల మత గురువు తేజ్ బహదూర్‌కు ప్రత్యేక ప్రార్థనలు 
  • నిన్న  తేజ్ బహదూర్‌ జయంతి
  • నారింజ రంగు జుబ్బా ధరించి వెళ్లిన మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం ఢిల్లీలోని గురుద్వారా రికబ్ గంజ్ సాహిబ్‌కు సాధారణ భక్తుడిలా వెళ్లి సందర్శించారు. సిక్కుల మత గురువు తేజ్ బహదూర్‌కు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గురుద్వారా రికబ్ గంజ్ సాహిబ్‌ సందర్శన ఆయన షెడ్యూల్‌లో లేదు.

అయినప్పటికీ ఒక్కసారిగా ఆయన కనపడ్డారు. నిన్న సిక్కుల మత గురువు తేజ్ బహదూర్‌ జయంతి వేడుక జరిగింది. ఈ సందర్భంగానే ఈ రోజు ఉదయం మోదీ అక్కడ కనపడడం విశేషం. నారింజ రంగు జుబ్బాతో పాటు దానిపై ఆరెంజ్ రంగు కోటు, తెలుపు పైజామాతో ఆయన గురుద్వారా రికబ్ గంజ్ సాహిబ్‌ను దర్శించుకున్నారు. పూజా సామగ్రిని అక్కడ మతగురువుకు మోదీ అందించారు. ఈ విషయాలను తెలుపుతూ నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
Narendra Modi
BJP
New Delhi

More Telugu News