Shami: మహమ్మద్ షమీకి గాయం... మిగతా మూడు టెస్టులకూ దూరం!

Shami is not playing in next Test matches with Australia

  • తొలి మ్యాచ్ లో గాయపడిన షమీ
  • కమిన్స్ వేసిన బంతితో విరిగిన మణికట్టు
  • సైనీ లేదా సిరాజ్ లకు అవకాశం

ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ సందర్భంగా తొలి మ్యాచ్ లో ఘోరంగా ఓడిపోయిన భారత్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో ప్రధాన పేసర్గా ఉన్న మహమ్మద్ షమీ మణికట్టుకు గాయం అయింది. దీంతో అతను మిగతా మూడు టెస్ట్ మ్యాచ్ లలో ఆడే అవకాశం లేకుండా పోయింది. నిన్న షమీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కమిన్స్ బంతి వేయగా, అది నేరుగా వచ్చి షమీ మణికట్టును తాకింది.

దీంతో షమీ కాసేపు నొప్పితో విలవిల్లాడి, తదుపరి బాల్ ను ఎదుర్కోలేకపోయాడు. ఆపై వైద్యులు పరీక్షించగా, అతని మణికట్టు ఎముక విరిగిందని తేలింది. ఇక షమీ స్థానంలో నవదీప్ సైనీ లేదా మొహమ్మద్ సిరాజ్ లలో ఎవరినైనా జట్టులో బౌలర్ గా తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

  • Loading...

More Telugu News