Andhra Pradesh: కారు పంపిస్తాను.. వచ్చి భోజనం చేసి వెళ్లండి: ఏపీ ఆదర్శ రైతుకు కేసీఆర్ ఆహ్వానం

Telangana cm kcr invites ap farmer
  • ఘంటసాల రైతుకు కేసీఆర్ ఫోన్
  • వెద పద్ధతి సాగు గురించి అడిగి తెలుసుకున్న సీఎం
  • వచ్చి ఒకపూట ఉండి వెళ్లాలని ఆహ్వానం
తాను కారు పంపిస్తానని, వచ్చి భోజనం చేసి వెళ్లాలంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆదర్శ రైతును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఘంటసాలపాలేనికి చెందిన ఆదర్శ రైతు ఉప్పల ప్రసాదరావు 35 ఎకరాల్లో సీడ్రిల్ ఉపయోగించి వెద పద్ధతిలో సన్నాల రకం వరిని సాగుచేసి అధిక దిగుబడి సాధించారు. ఎకరానికి దాదాపు 45 బస్తాల వరకు దిగుబడి సాధించారు.

ప్రసాదరావు వ్యవసాయ పద్ధతుల గురించి తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు ఫోన్ చేసి అభినందించారు. వెద పద్ధతి గురించి ఆయనను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తాను కారు పంపిస్తానని, ఒక పూట ఉండి భోజనం చేసి వెళ్లాలని ఆయనను ఆహ్వానించారు. తెలంగాణలో వ్యవసాయ పద్ధతులను పరిశీలించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.
Andhra Pradesh
Telangana
KCR
Farmer

More Telugu News