ఆసీస్ చేతిలో ఘోర పరాభవం.. రవిశాస్త్రిని తక్షణం తొలగించాంటూ ‘దాదా’కు విన్నపాలు!
- ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడిన భారత్
- రవిశాస్త్రే కారణమంటూ విరుచుకుపడుతున్న నెటిజన్లు
- ద్రవిడ్‌కు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్
ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో రాణించిన భారత బ్యాట్స్‌మన్ రెండో ఇన్సింగ్స్‌లో అప్పుడే బ్యాట్ పట్టిన వారిలా ఆడారు. ఒక్కరంటే ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. మయాంక్ అగర్వాల్ చేసిన 9 పరుగులే జట్టులో అత్యధిక వ్యక్తిగత పరుగులు కావడం గమనార్హం. భారత జట్టు ఆటతీరుపై సగటు అభిమానులే కాదు, మాజీ క్రికెటర్లు కూడా దుమ్మెత్తి పోస్తున్నారు. టీమిండియా మాజీ బ్యాట్స్‌మన్ సెహ్వాగ్ అయితే మరో అడుగు ముందుకు వేసి ఈ ఓటమిని మర్చిపోయేందుకు ఓటీపీ ఇదేనంటూ ఆటగాళ్లు చేసిన వ్యక్తిగత స్కోరును నంబరుగా పేర్కొన్నాడు.