Vijayasai Reddy: ఆంధ్రాలో మరో మాల్యా తయారయ్యాడు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy comments over CBI raids on Rayapati Sambasiva Rao house
  • మాజీ ఎంపీ రాయపాటి నివాసంలో సీబీఐ సోదాలు
  • రాయపాటి పోలవరం నిధులు మేశాడన్న విజయసాయి
  • నిధులను విదేశాలకు మళ్లించాడని ఆరోపణ
  • ఆ డబ్బు చంద్రబాబుదేమో అంటూ వ్యాఖ్యలు
  • నకిలీ పత్రాలతో నిధులు మళ్లించారంటూ ట్వీట్
మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించడం పట్ల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఆంధ్రాలో మరో మాల్యా తయారయ్యాడంటూ వ్యాఖ్యానించారు. మాజీ ఎంపీ రాయపాటి పోలవరం నిధులను మేశాడని, నిధులను విదేశాలకు మళ్లించాడని ఆరోపించారు.

ఇంతకూ ఆ డబ్బు ఆంధ్రా మాల్యాదేనా? లేక చంద్రబాబుదేనా? అని సందేహం వ్యక్తం చేశారు. అసలు సిసలు ఆంధ్రా మాల్యా చంద్రబాబేనా? అని విజయసాయి ట్వీట్ చేశారు. ఈ వ్యవహారంలో నకిలీ పత్రాలతో నిధులు మళ్లించి బ్యాంకులకు రూ.7,926 కోట్లు నష్టం చేకూర్చినట్టు సీబీఐ అభియోగం అని వెల్లడించారు.
Vijayasai Reddy
Rayapati Sambasiva Rao
CBI Raids
Chandrababu
Polavaram Project
CBI
Andhra Pradesh

More Telugu News