Kurnool District: కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో కరోనా కలకలం

13 students in Kurnool school tests with Corona
  • రుద్రవరం హైస్కూల్లో కరోనా పంజా
  • విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా 13 మందికి పాజిటివ్
  • వారం రోజులు సెలవులు ప్రకటించిన అధికారులు
ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో మరో 479 కొత్త కేసులు నమోదయ్యాయి. మరోవైపు కర్నూలు జిల్లాలో కలకలం రేగింది. రుద్రవరం ప్రాథమికోన్నత పాఠశాలలో కరోనా పంజా విసిరింది. పదో తరగతి చదువుతున్న 13 మంది విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో, విద్యార్థులు, అధ్యాపకులతో పాటు స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

కరోనా నేపథ్యంలో స్కూలుకు వారం రోజుల పాటు అధికారులు సెలవులు ప్రకటించారు. పాఠశాలను పూర్తిగా శానిటైజ్ చేసిన తర్వాత మళ్లీ తెరవనున్నారు. రెగ్యులర్ పరీక్షల్లో భాగంగా విద్యార్థులకు కోవిడ్ టెస్టులను నిర్వహించగా 13 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
Kurnool District
Rudravaram High School
Corona Virus

More Telugu News