వచ్చే జనవరి నుంచి కార్లు, బైకుల ధరలు మరింత ప్రియం
- పెరిగిన ఇన్ పుట్ వ్యయం
- స్టీల్, ప్లాస్టిక్, అల్యూమినియం ధరల పెంపు
- వాహనాల ధరలు పెంచకతప్పడంలేదన్న ఆటోమొబైల్ కంపెనీలు
- రూ.28 వేల వరకు పెంచుతున్న రెనో
- గరిష్టంగా రూ.1,500 వరకు ధర పెంచుతున్నట్టు హీరో వెల్లడి
తాజాగా, వివిధ కార్ల మోడళ్లపై గరిష్టంగా రూ.28 వేల వరకు పెంచుతున్నట్టు రెనో ప్రకటించింది. ట్రైబర్, క్విడ్, డస్టర్ మోడళ్ల ధరలను త్వరలో సవరించనుంది. పెంచిన ధరలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అటు, దేశీయ ద్విచక్రవాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ కూడా తన బైక్ మోడళ్లపై రూ.1,500 వరకు పెంచనుంది. ఈ మేరకు ఓ ప్రకటనలో తెలిపింది. ఇన్ పుట్ వ్యయం పెరిగినందున తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని హీరో వెల్లడించింది.